
న్యూఢిల్లీ: డోప్ టెస్టులో పట్టుబడ్డ ఇండియా స్టార్ వెయిట్ లిఫ్టర్, రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ సంజితా చానుపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నాలుగేండ్ల బ్యాన్ విధించింది. గతేడాది గుజరాత్ ఆతిథ్యం ఇచ్చిన నేషనల్ గేమ్స్ సందర్భంగా సేకరించిన సంజిత శాంపిల్స్‌లో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) నిషేధిత జాబితాలోని డ్రోస్టానోలోన్ మెటాబోలైట్ డ్రగ్ గుర్తించారు.
దాంతో ఆమెపై నాలుగేండ్ల బ్యాన్ పడిందని ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సహదేవ్ యాదవ్ మంగళవారం కన్ఫామ్ చేశారు. నేషనల్ గేమ్స్‌లో ఆమె గెలిచిన సిల్వర్ మెడల్‌ను వెనక్కితీసుకోనున్నారు. నాడా బ్యాన్‌పై అప్పీల్ చేసే ఆప్షన్ ఉన్నప్పటికీ ఈ విషయంపై మణిపూర్ లిఫ్టర్ సంజితా చాను ఇంకా స్పందించలేదు.