ఎమోషనల్ అండ్ స్పోర్ట్ ఫిల్మ్ 'జెర్సీ'కి నాలుగేళ్లు

ఎమోషనల్ అండ్ స్పోర్ట్ ఫిల్మ్ 'జెర్సీ'కి నాలుగేళ్లు

గౌత‌మ్ తిన్ననూరి ద‌ర్శక‌త్వంలో క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో వ‌చ్చిన హీరో నాని తీసిన చిత్రం జెర్సీ.. ఏప్రిల్ 19తో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని నాని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. మన మాస్టర్ పీస్ కి అప్పుడే 4ఏళ్లు పూర్తియిందా అని తెలిపే క్యాప్షన్ తో తాను జెర్సీలో నటించిన పెయింటెడ్ ఫార్మాట్ లో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా నెటిజన్లు, ఆయన ఫ్యాన్సు కంగ్రాజ్యులేషన్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. సినిమాలోని కొన్ని క్లిప్స్ ను షేర్ చేస్తూ.. సినిమాపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించారు.

2019లో రిలీజైన జెర్సీ సినిమా భారీ విజయాన్ని సాధించి, ఇప్పటివరకు అనేక అవార్డులు గెలుచుకుంది. అందులో భాగంగా  జెర్సీ 67వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ ఎడిటర్ విభాగాల్లో రెండింటికీ రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది. విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్న చిత్రంగా నిలిచింది. ప్రపంచం నలుమూలల నుంచి ఎన్నో ప్రశంసలు పొందిన  జెర్సీ.. హిందీ రిమేక్ లో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలలో నటించారు. 

https://twitter.com/NameisNani/status/1648552876833161222