V6 News

మంత్రి పేరు చెప్పి.. ఫైల్ క్లియర్ చేయిస్తానని రూ. కోటి 70 లక్షల మోసం.. జూబ్లీహిల్స్లో కేసు నమోదు

మంత్రి పేరు చెప్పి.. ఫైల్ క్లియర్ చేయిస్తానని రూ. కోటి 70 లక్షల మోసం.. జూబ్లీహిల్స్లో కేసు నమోదు

మంత్రి పేరు చెప్పి ఒక వ్యక్తి కోటి 70 లక్షల రూపాయల మోసానికి పాల్పడిన ఘటనపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కేసు నమోదైంది. మంత్రి తనకు బాగా తెలుసునని.. ప్రాజెక్ట్ ఫైల్ క్లియర్ చేయిస్తానని తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

 బంగారూయాదవ్ అనే వ్యక్తి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఫైల్ క్లియర్ చేయిస్తానని ఒక వ్యక్తిని నమ్మించి 2 కోట్ల రూపాయలకు డీల్ సెట్ చేసుకున్నాడు. బాధితుడి నుంచి ఇప్పటికే  కోటి 70 లక్షలు, ఒక ఐ ఫోన్, ఒక అల్కాజార్ కార్ తీసుకున్నాడు నిందితుడు.

ఫైల్ క్లియర్ చేయిస్తానని చెప్పి18 నేలలు గడుస్తున్నా ఎలాంటి ముందడుగు పడకపోవడం తో డబ్బులు తిరిగి ఇవ్వాలి బాధితుడు పట్టుబట్టాడు. డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడటంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.