ఫారెన్ ఎక్సైంజ్ పేరుతో మోసాలు : వ్యక్తి అరెస్ట్

ఫారెన్ ఎక్సైంజ్ పేరుతో మోసాలు : వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్: ఫారెన్ ఎక్సైంజ్ పేరుతో మోసాలు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. డాలర్లకు ఇండియన్ కరెన్సీ ఇస్తానంటూ రాహుల్ అనే నిందితుడు పుణెలో పలువురిని మోసం చేశాడు. ఇటీవల హైదరబాద్ లో ఇద్దరు వ్యక్తులను మోసం చేశాడు. సర్వీస్ అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకుని తన సొంత ఇల్లు అని నమ్మిస్తూ రాహుల్ మోసాలకు పాల్పడ్డాడు. తన ఇంటి వద్దే కరెన్సీ మార్చి ఇస్తానని చెప్పి తీరా అక్కడికి వెళ్లిన తర్వాత డాలర్లు తీసుకుని పారిపోవడం చేస్తుంటాడు.

రాహుల్ పై ఇంతకు ముందు పుణెలో రెండు కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ లోనూ ఇద్దరు మోసపోవడంతో.. ఇటీవలే బంజారాహిల్స్ పోలీసులకు బాధితులు పిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం హైదరాబాద్ లో రాహుల్ ను పట్టుకున్నట్లు తెలిపారు వెస్ట్ జోన్ పోలీసులు. ఇలాంటి మోసగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానం కలిగిన పోలీసులను సంప్రదించాలని తెలిపారు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్.