గోదావరిఖని : పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్

గోదావరిఖని : పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్

గోదావరిఖని, వెలుగు: గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌బీ, ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌సీ వంటి ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రామగుండం మేయర్​ మహాంకాళి స్వామి, హైదరాబాద్‌‌‌‌కు చెందిన పీజేఎఆర్‌‌‌‌‌‌‌‌ కోచింగ్​సెంటర్​ డైరెక్టర్​ జగదీశ్వర్​రెడ్డి తెలిపారు. 

గురువారం వారు మాట్లాడుతూ గోదావరిఖని సింగరేణి హైస్కూల్‌‌‌‌లో శిక్షణ ఇవ్వనున్నామని, అర్హులైన అభ్యర్థులకు శుక్రవారం నుంచి ఈ నెల 25 వరకు రామగుండం మున్సిపల్​ ఆఫీస్​లో అప్లికేషన్ ఫాంలను అందజేస్తామని చెప్పారు. జూలై మొదటి వారంలో ప్రారంభమయ్యే ఈ శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.