ఆర్టీసీ ఉద్యోగులకు ఫ్రీగా కరోనా కిట్లు

ఆర్టీసీ ఉద్యోగులకు ఫ్రీగా కరోనా కిట్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఆర్టీసీలో కరోనా బారిన పడిన ఉద్యోగులకు ఫ్రీగా కిట్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు అన్నియూనిట్లకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చే కిట్‌ కంటే ఇందులో అదనంగా ఎక్విప్‌మెంట్‌ ఉంటుందని అధికారులు చెప్పారు. 14 రోజులకు సరిపడా మెడిసిన్స్‌, శానిటైజర్‌, గ్లౌజ్‌లు, మాస్క్‌‌‌‌ల తోపాటు ఆక్సిజన్‌ లెవల్స్‌ పరీక్షించుకోవడానికి పల్స్‌ ఆక్సీమీటర్‌ను కిట్ లో అందిస్తామన్నారు. కండిషన్‌ సీరియస్‌ అయితే తమ దృష్టికి తీసుకొస్తే ట్రీట్‌మెంట్‌ చేయిస్తామని అడ్మినిస్ట్రేషన్‌ ఇన్‌చార్జి ఈడీ, సీపీఎం సూర్యకిరణ్ మంగళవారం చెప్పారు. నాలుగు నెలల్లో ఆర్టీసీలో 500కిపైగా కరోనా కేసులు నమోదైనట్లు తెలిపారు.

For More News..

దేశంలో తొలి సోలార్‌‌రూఫ్‌కు పేటెంట్

ఒకే వ్యక్తికి మూడు నెలల్లో రెండోసారి కరోనా

పోలీస్ టవర్స్ కు 300 కోట్లు అనుకుంటే.. 700 కోట్లు అయితుంది