సింగరేణి కార్మికులకు ఫ్రీగా కరోనా వ్యాక్సిన్

సింగరేణి కార్మికులకు ఫ్రీగా కరోనా వ్యాక్సిన్

సింగరేణి కార్మికులకు.. వారి కుటుంబసభ్యులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు. దీనికి సంబంధించి సింగరేణి సీఎండీ శ్రీధర్ చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. వ్యాక్సినేషన్‌ కోసం సింగరేణి ఏరియాల్లోని ఆస్పత్రులు, డిస్పెన్సరీలను సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సీఎండీకి లేఖ రాసింది. వ్యాక్సినేషన్ కోసం ఏరియా ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంస్థ ప్రధాన వైద్యాధికారి తెలిపారు. ప్రస్తుత రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 45 ఏళ్లు పైబడి.. రక్తపోటు, మధుమేహం వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డుతో పాటు సంస్థ ఇచ్చిన వైద్య గుర్తింపు కార్డును తీసుకురావాల్సిందిగా సూచించారు.