బషీర్‌బాగ్, వెలుగు: ప్రాణాలను కాపాడే సీపీఆర్(కార్డియో పల్మనరీ రీససిటేషన్)పై ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జీవీకే గ్రీన్ హెల్త్ సర్వీసెస్ శనివారం నిర్వహించనుంది. గోషామహల్ బరాదరీలోని మాసోనిక్ భవనంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కార్యక్రమం జరగనుంది. సీపీఆర్‌తోపాటు ఏఈడీ(ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డిఫిబ్రిలేటర్) వినియోగంపైనా శిక్షణ ఇవ్వనున్నారు.
సెక్యూరిటీ గార్డులు, వాచ్‌మెన్లు, ఆటో,-క్యాబ్ డ్రైవర్లు, గృహ సహాయకులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. ముందస్తు నమోదు చేసుకున్న 40 మందికి మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. నమోదు కోసం 98480 42020 ఫోన్నంబర్లో సంప్రదించాలని సూచించారు.
