
గ్రూప్ 1, 2, 3, 4 ఫౌండేషన్ కోర్సుకు ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని వచ్చే నెల అంటే 2024 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని (12) టీఎస్ బీసీ స్టడీ సర్కిళ్లలో నిర్వహించనున్నట్లు టీఎస్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు 2024 జనవరి 8 నుంచి 20 వరకు www.tsbcstudycircle.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించారు.
దీనికి గానూ తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉండాలని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక విధానం రిజర్వేషన్, డిగ్రీ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుందని చెప్పారు. అమలులో ఉన్న నిబంధనల ప్రకారం స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 040-24071178 & 040-27077929 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.