హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) దివ్యాంగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ వినోదాన్ని వారికి చేరువ చేయాలనే ఉద్దేశంతో, ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రతి మ్యాచ్‌కు 30 మంది దివ్యాంగులకు ఉచితంగా పాసులు ఇవ్వాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా సోమవారం సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భంగా 30 మందికి టికెట్లు అందజేసి, ప్రత్యక్షంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పించింది. హెచ్‌సీఏ కార్యదర్శి మన్నె జీవన్ రెడ్డి స్వయంగా దివ్యాంగులతో కలిసి గ్యాలరీలో కూర్చొని మ్యాచ్ వీక్షించారు.
సామాజిక బాధ్యతగా తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీజన్ లో జరిగే అన్ని మ్యాచ్‌లకు ఈ సౌకర్యం వర్తిస్తుందని జీవన్ రెడ్డి తెలిపారు.

