తెలంగాణలో ఫ్రీడమ్ వంటనూనెల ప్లాంటు

తెలంగాణలో ఫ్రీడమ్ వంటనూనెల ప్లాంటు
  • రూ.500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు

హైదరాబాద్:  ఫ్రీడమ్‌​ బ్రాండ్​ వంటనూనెలు అమ్మే  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ తెలంగాణలో దాదాపు 50 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఎడిబుల్ ఆయిల్ తయారీ ప్లాంట్‌‌‌‌ను ఏర్పాటు చేయనుంది. రూ.500 కోట్ల ఇన్వెస్ట్​మెంట్​తో పెట్టబోయే ఈ ఫెసిలిటీకి1,000 టన్నుల కెపాసిటీ ఉంటుంది. ఇక్కడ ఆయిల్​ ప్రాసెసింగ్​, సాల్వెంట్​ ఎక్స్​ట్రాక్షన్​ సదుపాయాలు ఉంటాయి. హైదరాబాద్​లో శుక్రవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ (జీఈఎఫ్) ఎండీ ప్రదీప్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పామాయిల్ వంటి నూనెగింజల సాగును ఎంకరేజ్​ చేస్తుండటంతో ఇక్కడ ప్లాంటు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తమ కంపెనీకి కాకినాడ,  కృష్ణపట్నంలలో  రిఫైనింగ్ యూనిట్లు ఉన్నాయని, వీటి కెపాసిటీ రోజుకు 2,615 మెట్రిక్ టన్నులని వెల్లడించారు. ఇదిలా ఉంటే కిందటి ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలపరంగా తమ సన్​ఫ్లవర్​ ఆయిల్​కు నంబర్​వన్​ ర్యాంకు వచ్చిందని చెప్పారు.