
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్, జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో 10 వేల ఎకో ఫ్రెండ్లీ సీడ్గణేశ్బాక్సులను పంపిణీ చేస్తున్నారు. ఇందులో హైదరాబాద్‌లో 5 వేలు, బెంగళూరులో 5 వేలను పంపిణీ చేస్తున్నట్టు ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ మార్కెటింగ్ డీజీఎం చేతన్ పింపాలుటే తెలిపారు.
శుక్రవారం ఈ సీడ్ గణేశ్వెహికల్స్ను జెండా ఊపి ప్రారంభించారు. సిటీలోని రిడ్జ్ టవర్స్, మై హోమ్ జ్యువెల్, వన్ సిటీ, సాయి మిత్రా టవర్స్, కృష్ణకుంజ్ గార్డినియా, మలేషియన్ టౌన్షిప్రెయిన్ ట్రీ పార్క్, స్వాన్జక్ అపార్ట్మెంట్స్ మొదలైన అపార్ట్మెంట్, కాంప్లెక్స్‌లో వీటిని పంపిణీ చేస్తామని చెప్పారు.