హైదరాబాద్: మల్లేపల్లి ఐటీఐలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ) విద్యార్థుల కోసం ప్రత్యేక మెగా జాబ్ మేళా నిర్వహించారు. మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో ఈ ప్రత్యేక మెగా జాబ్ మేళా కొనసాగుతోంది. ఏటీసీ పాస్‌అవుట్ విద్యార్థుల కోసం నిర్వహించిన జాబ్ మేళాలో 30 కంపెనీల హెచ్‌ఆర్ ప్రతినిధుల పాల్గొన్నారు. సుమారు 2,500 మంది ఏటీసీ పాస్‌అవుట్ యువత ఇంటర్వ్యూకు హాజరవుతున్నారు. తదుపరి ప్రత్యేక మెగా జాబ్ మేళా త్వరలో వరంగల్ జోన్‌లో నిర్వహించనున్నారు.
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏటీసీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో ప్రస్తుతం ఉన్న ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లు(ఏటీసీ)గా అప్ గ్రేడ్ చేసింది.
ఈ కేంద్రాల ద్వారా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఇండస్ట్రీ 4.0 కోర్సులలో అధునాతన సాంకేతిక శిక్షణ అందిస్తున్నారు. ఏటీసీల్లో కోర్సులు అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం నెలకు రూ.2 వేల చొప్పున స్కాలర్ షిప్ కూడా అందిస్తోంది. కోర్స్ అయిన వెంటనే వివిధ ప్రైవేట్ కంపెనీల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పి్స్తున్నారు.
