హైదరాబాద్ సిటీ బస్సుల్లో టీ24 బస్పాస్లపై ఫ్రీడం ఆఫర్ తొలగింపు

హైదరాబాద్ సిటీ బస్సుల్లో టీ24 బస్పాస్లపై ఫ్రీడం ఆఫర్ తొలగింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో టీ-24 బస్ పాస్​లపై ఆర్టీసీ అమలు చేస్తున్న ఫ్రీడం ఆఫర్ ను తొలగించింది. దీంతో మళ్లీ పాత ధరలే వసూలు చేస్తున్నారు. గతేడాది ఆగస్టుకు ముందు వరకు టీ-24 పాస్​లకు పెద్దలకు రూ.150, మహిళలు, సీనియర్ సిటిజన్లకు రూ.120,  పిల్లలకు రూ. 100 తీసుకునేవారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్రీడం ఆఫర్ ప్రకటించిన ఆర్టీసీ అప్పటి నుంచి పెద్దలకు రూ.130, మహిళలు, సీనియర్ సిటిజన్లకు రూ.110, పిల్లలకు రూ. 90 తీసుకుంటోంది. తాజాగా మార్చి 1 నుంచి ఫ్రీడం ఆఫర్ తొలగించింది. దీంతో తిరిగి పాత రేట్లే అందుబాటులోకి వచ్చాయి.