చిన్న కారణాలకే రాజీనామా చేసేస్తారా..? బ్రిటన్ ప్రధాని రిజైన్ వెనుక కారణాలు ఇవే?

చిన్న కారణాలకే రాజీనామా చేసేస్తారా..? బ్రిటన్ ప్రధాని రిజైన్ వెనుక కారణాలు ఇవే?

చాలా ఏళ్ల పాటు ప్రతిపక్షానికే పరిమితమైన లేబర్ పార్టీకి ఊపిరిలూది.. చారిత్రాత్మక విజయంతో బ్రిటన్ ప్రధాని పీఠాన్ని దక్కించుకున్న కీర్ స్టార్మర్.. సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీ ఎంపీలు, క్యాబినెట్ మంత్రుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. బ్రిటన్ రాజకీయంలో లేబర్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చిన కింగ్ మేకర్‌గా నిలిచిన స్టార్మర్.. ప్రధాని అయిన కేవలం రెండేళ్ల లోపే ఇలా అర్థాంతరంగా తప్పుకోవాల్సి రావడం అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశమైంది.

కీర్ స్టార్మర్ ప్రధాని పదవి నుండి పక్కకు తప్పుకోవడానికి దారితీసిన ప్రధాన కారణాలు ఇవే:

1. స్థానిక ఎన్నికల్లో ఓటమి: బ్రిటన్ స్థానిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీనికి తోడు నార్త్ వెస్ట్ ఇంగ్లాండ్‌లో జరిగిన కీలకమైన బై-ఎలక్షన్‌లో లేబర్ పార్టీకి గట్టి ప్రత్యర్థి అయిన ఆండీ బర్న్‌హామ్ భారీ విజయం సాధించడంతో స్టార్మర్ నాయకత్వం పూర్తిగా బలహీనపడింది.

2. పడిపోయిన రేటింగ్స్: స్టార్మర్ వ్యక్తిగత ఇమేజ్, ప్రజాదరణ రికార్డు స్థాయిలో పడిపోయాయి. ఒక దశలో ఆయన అప్రూవల్ రేటింగ్స్ కేవలం 19 శాతానికి పడిపోవడంతో.. ఈ శతాబ్దంలోనే బ్రిటన్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ లేని ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు.

3. పీటర్ మాండెల్సన్ నియామక వివాదం: అమెరికాకు బ్రిటన్ రాయబారిగా పీటర్ మాండెల్సన్‌ను నియమించడం స్టార్మర్ కెరీర్‌లోనే పెద్ద మైనస్‌గా మారింది. గతంలో లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో మాండెల్సన్‌కు ఉన్న సంబంధాల కారణంగా ఈ నియామకంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పైగా ఆయన సెక్యూరిటీ వెట్టింగ్‌లో ఫెయిల్ అయినప్పటికీ నియమించారనే వార్తలు స్టార్మర్ ప్రభుత్వాన్ని కుదిపేశాయి.

4. క్యాబినెట్ మంత్రుల రాజీనామాలు: హెల్త్ సెక్రటరీ వెస్ స్ట్రీటింగ్ వంటి కీలక నేతలతో పాటు బ్రిటన్ రక్షణ రంగానికి చెందిన టాప్ అధికారులు స్టార్మర్ వైఖరి నచ్చక రాజీనామాలు చేశారు. సొంత పార్టీ ఎంపీలు, మంత్రుల్లోనే ప్రధానిపై నమ్మకం తగ్గటం ఆయనను ఒంటరిని చేసాయి.

5. పాలసీ వైఫల్యాలు, అంతర్జాతీయ ఒత్తిడి: దేశీయంగా వలసల నియంత్రణ, నార్త్ సీ ఆయిల్ అన్వేషణపై పరిమితులు విధించడం వంటి ఇంధన విధానాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. అలాగే అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుండి వచ్చిన ఒత్తిడిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారనే ఆరోపణలు స్టార్మర్ రాజీనామాకు దారితీశాయి.

ALSO READ : బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా.. 

మెుత్తానికి హార్మూజ్ జలసంధి విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించటం, అమెరికా టెక్, సోషల్ మీడియా కంపెనీలకు ఇబ్బంది కలిగించేలా చట్టాల్లో మార్పులు చేయటం వంటి కీలక పరిణామాల తర్వాత హార్మర్ పై ఒత్తిడి పెరగటం, ఆయన పక్కకు తప్పుకోవాల్సి రావటం చూస్తుంటే దీని వెనుక అమెరికా సీఐఐ హస్తం ఉందా అనే చర్చ కూడా భారీగానే జరుగుతోంది.