బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా.. పదేళ్లలో ఆరో పీఎం

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా.. పదేళ్లలో ఆరో పీఎం

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేశారు. లేబర్ పార్టీ నుంచి గత కొంత కాలంగా వస్తున్న ఒత్తిడితో ఆయన సోమవారం (జూన్ 22) రాజీనామా చేశారు.  స్టార్మత్ తో కలిపి గత పదేళ్లలో   6 మంది ప్రధానులు రాజీనామా చేశారు. 

అంతకు ముందు స్టార్మర్ రాజీనామా చేస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

2024 లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన స్టార్మర్, కేవలం రెండేళ్లలోనే తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో .. చివరికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 

ప్రధాన మంత్రిగా రాజీనామా చేయటానికి ముందు బ్రిటన్ రాజును కలిశారు స్టార్మర్. రాజు అనుమతి తీసుకుని రాజీనామా లేఖ సమర్పించారు. కొత్త ప్రధానమంత్రి ఎన్నికకు సంబంధించి జూలై 9వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించి.. వచ్చే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యేలోగా పూర్తి చేయాలని లేబర్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీని కోరారు స్టార్మర్. అప్పటి వరకు కీర్ స్టార్మర్ ప్రధానమంత్రిగా కొనసాగుతారు.

లేబర్ పార్టీ బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా దివాళా తీసిందని.. అలాంటి సమయంలో వారసత్వంగా నాకు లేబర్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చానని స్పష్టం చేశారు కీర్ స్టార్మర్. ఇదే విషయాన్ని పార్టీకి వివరించానని.. అది ముగిసిపోయిన అంశంగా చూశారు తప్పితే నా సమర్థతను గుర్తించలేదన్నారు యూకే ప్రధాని స్టార్మర్. నాయకత్వ మార్పునకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు లేకుండా సహకరిస్తానని.. నా వారసుడికి పూర్తి మద్దతు ఇస్తానని వివరించారు స్టార్మర్. రెండేళ్ల క్రితం ప్రధాని మంత్రిగా బాధ్యతలు స్వీకరించటం అనేది తన జీవితంలోనే అత్యంత గొప్ప, గర్వించదగిన క్షణాలుగా అభివర్ణించారు కీర్ స్టార్మర్.

ప్రజాదరణ పాతాళానికి: 

స్టార్మర్ నాయకత్వానికి గత కొన్నాళ్లుగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో నైజెల్ ఫరాజ్ నేతృత్వంలోని కన్జర్వేటివ్‌లు (రిఫార్మ్ యూకే పార్టీ) స్వీప్ చేయడంతో స్టార్మర్ ఇమేజ్ భారీగా దెబ్బతింది.  బ్రిటన్ చరిత్రలోనే అత్యంత తక్కువ ప్రజాదరణ (Popularity ratings) కలిగిన నాయకుడిగా స్టార్మర్ రేటింగ్స్ పడిపోయాయి. ఆర్థిక వృద్ధిని సాధించలేకపోవడం, నిత్యావసరాల ఖర్చులు పెరగడం, ప్రజల్లో ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి పెరగడం స్టార్మర్‌కు ప్రతికూలంగా మారాయి.  

సొంత పార్టీ నుంచే ఒత్తిడి: 

లేబర్ పార్టీకి చెందిన వంద మందికి పైగా ఎంపీలు, కొందరు క్యాబినెట్ మంత్రులు స్టార్మర్‌ను వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని లేదా ఎగ్జిట్ టైమ్‌లైన్ ప్రకటించాలని బహిరంగంగానే డిమాండ్ చేశారు.   

ALSO READ : స్విట్జర్లాండ్‌లో హైడ్రామా

తెరపైకి ఆండీ బర్న్‌హామ్!

గ్రేటర్ మాంచెస్టర్ మేయర్‌గా ఉన్న 56 ఏళ్ల ఆండీ బర్న్‌హామ్.. గత శుక్రవారం (జూన్ 12) జరిగిన మేకర్‌ఫీల్డ్ పార్లమెంట్ ఉపఎన్నికలో రిఫార్మ్ యూకే పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో ఓడించి వెస్ట్‌మినిస్టర్‌లోకి (పార్లమెంట్‌లో) అడుగుపెట్టారు. ఈ చారిత్రాత్మక విజయమే స్టార్మర్ నాయకత్వానికి ఆఖరి దెబ్బగా మారింది. 

లేబర్ పార్టీ రూల్స్ ప్రకారం స్టార్మర్ లీడర్‌షిప్‌ను అధికారికంగా సవాలు చేసేందుకు బర్న్‌హామ్ మార్గం సుగమం అయ్యింది.  స్టార్మర్ హయాంలో నష్టపోయిన పార్టీ పూర్వవైభవాన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న బర్న్‌హామ్ తిరిగి తీసుకురాగలరని మెజారిటీ లేబర్ పార్టీ నేతలు నమ్ముతున్నారు.