డబ్బులు కడితే పాస్ చేస్తారా? పిల్లల భవిష్యత్తుకు జిమ్మేదార్ ఎవరు?

డబ్బులు కడితే పాస్ చేస్తారా? పిల్లల భవిష్యత్తుకు జిమ్మేదార్ ఎవరు?

హైదరాబాద్ నాంపల్లి ఇంటర్ బోర్డ్ దగ్గర ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులు తమ నిరసన తెలుపుతున్నారు. కష్టపడి చదివినా తమ బిడ్డలకు తక్కువ మార్కులొచ్చాయని అన్నారు. రీ వాల్యుయేషన్ చేయించిన ప్రతిసారి మంచి మార్కులు వస్తున్నాయనీ.. ఈసారైతే మరీ విచిత్రంగా ఉందని ఓ విద్యార్థి తల్లి తన ఆవేదన వీ6 తో వెళ్లబోసుకున్నారు.

ఆమె ఆవేదన ఆమె మాటల్లోనే..

“నా పిల్లలను నేను కష్టపడి చదివించుకుంటున్నా. ప్రైవేటు స్కూలు.. ప్రైవేటు కాలేజీలో చదివిస్తున్నా. మా పాప బాగా చదువుతుంది. కానీ.. ఇంటర్మీడియట్ లో మ్యాక్స్  A, B రెండూ ఫెయిలైందని మెమోలో పెట్టారు. 11, 12 మార్క్స్ వేశారు. రీవాల్యుయేషన్ పెట్టుకుంటే… 70, 68 మార్కులు వేశారు. పేపర్లు దిద్దేటప్పుడు తెలివిలేదా.. పేపర్ కరెక్షనే సరిగా లేదు.. పేపర్ దిద్దేవాళ్లదే తప్పు. డబ్బులు కడితేనే పాస్ మార్కులు వేస్తారా మీరు. నేను నాలుగు ఇండ్లల్లో పనిచేసుకుని.. నా పిల్లలను ఇంత కష్టపడి చదివించుకుంటే.. మా పిల్లల భవిష్యత్తు తోటి ఆడుకుంటున్నారు వాళ్లు. ఎవరి బాధ్యత.. ఎవరిది జిమ్మేదార్?” అంటూ సీరియస్ గా మాట్లాడారు ఆ తల్లి.