ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఎండీగా రవి రంజన్.. సిఫార్సు చేసిన ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐబీ

ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఎండీగా రవి రంజన్.. సిఫార్సు చేసిన ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐబీ

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల డైరెక్టర్ల నియామకానికి బాధ్యత వహించే ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐబీ) , స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ) మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రవి రంజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సిఫార్సు చేసింది.  ప్రస్తుతం డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న రంజన్, ఈ ఏడాది నవంబర్ 30న పదవీకాలం ముగించనున్న వినయ్ ఎం టోన్స్ స్థానంలో బాధ్యతలు చేపడతారు. ఈ నెల 11న ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐబీ తొమ్మిది మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది. వారి సమర్థత, అనుభవం, ప్రస్తుత ప్రమాణాల ఆధారంగా రంజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేసింది.

బోర్డు ఛైర్మన్ నేతృత్వంలో, నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లు సహకారంతో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ   పనిచేస్తోంది. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐబీ సిఫార్సుపై తుది నిర్ణయం ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ నియామక కమిటీ తీసుకుంటుంది. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐబీకి భాను ప్రతాప్ శర్మ (మాజీ డీఓపీటీ కార్యదర్శి) అధ్యక్షత వహిస్తున్నారు.  అనిమేష్ చౌహాన్, దీపక్ సింగాల్, శైలేంద్ర భండారి ఇతర సభ్యులు.