హైదరాబాదీలకు నిజంగా ఇది గుడ్ న్యూసే. సిటీలో ప్రతి ఇంటికి అందిస్తున్న ఉచిత మంచి నీటి పథకం కొనసాగింపుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పథకం కొనసాగించేందుకు నిధులు మంజూరు చేసింది. సిటీలో ప్రతి ఇంటికీ సరఫరా చేసే నెలకు 20 వేల ఉచిత తాగునీటి పథకానికి 75 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం.
ఉచిత మంచినీటి సరఫారకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు.. పథకాన్ని కొనసాగించేందుకు HMWSSB రీయింబర్స్‌మెంట్ కింద రూ.75 కోట్లకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు 2026 జూన్ 01న ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో గృహ వినియోగదారులకు నెలకు 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) ఈ నిధులను, రాయితీలను నేరుగా లబ్ధిదారుల బిల్లులలో సర్దుబాటు చేస్తుంటుంది.
నల్లా కనెక్షన్ కు మీ ఆధార్ నంబర్, కస్టమర్ అకౌంట్ నంబర్ ను అనుసంధానించాలి. మురికివాడలు మినహా, మిగిలిన డొమెస్టిక్ వినియోగదారులందరూ విధిగా వాటర్ మీటర్లు బిగించుకోవాలి. నెలకు 20 వేల లీటర్ల వరకు మాత్రమే నీరు ఉచితంగా లభిస్తుంది. ఒకవేళ నీటి వినియోగం ఈ పరిమితిని దాటితే, అదనపు వినియోగానికి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ALSO READ : కోన్ ఐస్ క్రీంలో వాన పాము
ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు, బిల్లుల వివరాలు లేదా ఆధార్ అనుసంధానం కోసం హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు (HMWSSB) అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు. లేదా బోర్డు వారి కస్టమర్ కేర్ నంబర్ 155313 కు సంప్రదించవచ్చు
