కోన్ ఐస్ క్రీంలో వాన పాము : ఆ పిల్లోడు తినుంటే పరిస్థితి ఏంటీ..?

కోన్ ఐస్ క్రీంలో వాన పాము : ఆ పిల్లోడు తినుంటే పరిస్థితి ఏంటీ..?

ఐస్ క్రీం.. ఎండాకాలంలో ఎంతో ఇష్టంగా తినేది. పిల్లలకు ఎంతో ఇష్టం.. అసలే సెలవులు.. అందులో సమ్మర్.. ఈవినింగ్ అయితే చాలు ఐస్ క్రీం అని మారాం చేసే పిల్లలు ఎందరో.. చిన్నా పెద్దా అందరూ ఐస్ క్రీంను ఎంతో ఇష్టంగా తినటం సహజం.. ఇక కోన్ ఐస్ క్రీం అంటే చాలు.. చకచకా లాగించేస్తారు.. అలాంటి ఐస్ క్రీంలో ఓ పెద్ద పురుగు.. వాన పాము వస్తే ఎలా ఉంటుంది.. కోన్ ఐస్ క్రీంలో అంత పెద్ద పురుగును గుర్తించకుండా చిన్న పిల్లలు తింటే పరిస్థితి ఏంటీ.. ఊహించటానికే కష్టం.. భయంగా ఉన్న ఈ ఘటన ముంబై సిటీ నడిబొడ్డున జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

థానేలోని ఓ వ్యక్తి.. తన చిన్నారి మేనల్లుడికి కోన్ ఐస్ క్రీం కొనిచ్చాడు. ఆ పిల్లోడు దాన్ని తింటున్న సమయంలో అందులో పెద్ద పురుగు కనిపించింది. ఐస్ క్రీంలో ఏదో ఉంది అంటూ ఆ పిల్లోడు తన మామయ్యకు చూపించాడు. అతను దాన్ని పరిశీలించగా.. పెద్ద పరుగు ఉంది. అంతే షాక్ అయ్యాడు ఆ వ్యక్తి. 

ALSO READ : ఆయిల్ ఫుడ్ తిన్నాక ఐస్ క్రీమ్ ఎందుకు తినకూడదు..?

వెంటనే ఈ విషయాన్ని కోన్ ఐస్ క్రీం అమ్మిన షాపు దగ్గరకు వెళ్లాడు. కోన్ ఐస్ క్రీంతోపాటు అందులోని పురుగును ఈ వ్యాపారికి చూపించాడు. అతని సమాధానం నిర్లక్ష్యంగా ఉందని.. ఇది మేం తయారు చేయలేదు.. మేం కేవలం అమ్మాం అంటూ చెప్పారంటూ అతను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఐస్ క్రీంలోని పురుగు ఫొటోలను షేర్ చేశాడు. కొద్ది సమయంలో అతని పోస్ట్ వైరల్ అయ్యింది.

కోన్ ఐస్ క్రీంలో వానపాము అనేది చిన్న విషయం కాదని.. ఇది నా ఒక్కడి కోసం చెప్పటం లేదని.. కోట్ల మంది పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీం విషయంలో ఇంత నిర్లక్ష్యం ఏంటని ప్రశ్నిస్తున్నాడు ఆ వ్యక్తి. ఇది నా కోసం చేస్తున్న పోరాటం కాదని.. పిల్లల కోసం చేస్తున్నట్లు వెల్లడించాడు ఆ వ్యక్తి. 

సగం తిన్న తర్వాత ఐస్ క్రీంలో పురుగు బయటపడిందని.. ఇప్పుడు ఆ పిల్లోడి ఆరోగ్యం ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నిస్తున్నాడు ఆ వ్యక్తి. తన పిల్లోడి కోసం కాకుండా ప్రతి బిడ్డ కోసం మాట్లాడుతున్నట్లు చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తి. 

ఐస్ క్రీం తయారీ కంపెనీ నుంచి ఎలాంటి సమాధానం లేదని.. అసలు వీళ్లు ఈ విషయాన్ని చాలా చిన్నదిగా చూస్తున్నట్లు వివరించాడు ఆ బాధిత వ్యక్తి. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీం తయారీ, ప్యాకింగ్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండటం ఏంటని కంపెనీని ప్రశ్నిస్తున్నాడు ఆ వ్యక్తి. 

కోన్ ఐస్ క్రీంలో వానపాము అనేది ఆన్ లైన్ లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. కోన్ ఐస్ క్రీం లోపల ఏముంటుందో తెలుసుకోవటం కష్టం.. తింటూ వెళితేనే లోపల ఏముందో తెలుస్తుంది కదా అంటున్నారు నెటిజన్లు. 

ఏదిఏమైనా కోన్ ఐస్ క్రీంలో వానపాము ఇప్పుడు ఐస్ క్రీం ప్రియులను భయాందోళనలకు గురి చేస్తుంది. కోన్ ఐస్ క్రీం చూస్తేనే ఇది గుర్తుకొస్తుంది అంటున్నారు మరికొందరు నెటిజన్లు.