మన లైఫ్‌స్టైల్‌లో ఆయిల్ ఫుడ్‌ను పూర్తిగా పక్కన పెట్టడం దాదాపు అసాధ్యం. నూనె పదార్థాలు నోటికి బాగుంటాయి. కానీ, ఆరోగ్యానికి మాత్రం చిక్కులు తెచ్చిపెడతాయి. అలాగని నచ్చిన ఫుడ్ కి దూరంగా ఉండలేం. అలాంటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వాలి. ఆయిల్ ఫుడ్ తిన్నాక ఇలా చేస్తే అజీర్తి, గుండెల్లో మంట లాంటి సమస్యలన్నీ తగ్గుతాయి. నూనె పదార్థాలు తిన్నాక గోరు వెచ్చని నీళ్లు తాగితే ఫుడ్ త్వరగా అరుగుతుంది. గ్రీన్ టీలోని ఫ్లేవనాయిడ్స్ జీర్ణక్రియ సరిగా జరిగేలా చేస్తాయి. అందుకని తిన్న గంట తర్వాత గ్రీన్ టీ తాగాలి.
నూనెలో వేగించిన ఫుడ్ తిన్నాక పెరుగు తింటే జీర్ణ వ్యవస్థ యాక్టివ్ అవుతుంది. పెరుగులోని లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అసిడిటీని రానివ్వదు. ఒక భోజనంలో నూనె పదార్థాలు తింటే.. ఆ తర్వాత భోజనంలో ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్ లాంటివి తినాలి. ఫైబర్ జీర్ణక్రియ సరిగా జరిగేలా చేస్తుంది. ఫైబర్ ఫుడ్ కొంచెం తిన్నా కడుపు నిండినట్టు అనిపిస్తుంది.
ALSO READ : ఆలుగడ్డ తొక్కలను పారేస్తున్నారా ?
అలా తక్కువ తినడం వల్ల ప్రతిరోజు డైట్ ని బ్యాలెన్స్ చేసినట్టు కూడా అవుతుంది.ఆయిలీ ఫుడ్ తిన్న వెంటనే ఐస్క్రీమ్స్ వంటివి తినొద్దు. అలా తింటే పేగులు, పొట్ట, లివర్ పై ఒత్తిడి పడుతుంది. జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. తరువాత రోజు కూడా వీలైనంత వరకు నట్స్, సీడ్స్ తింటే బెటర్.
