ఓయూ, వెలుగు: రవీంద్రభారతిలో గురువారం గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్3వ వర్ధంతిని పురస్కరించుకొని స్మారక సభ నిర్వహిస్తున్నట్లు ఆయన కుమారుడు, సంస్థ ఫౌండర్సూర్యకిరణ్తెలిపారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట సంబంధిత వాల్పోస్టర్ఆవిష్కరించారు. ఈ సభకు రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేడ్కర్ మనవడు ప్రకాశ్అంబేడ్కర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని, కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు అధిక సంఖ్యలో తరలిరవాలని కోరారు.
