గ్యాడ్జెట్స్ గ్యాలరీ

గ్యాడ్జెట్స్ గ్యాలరీ

బర్త్​డే పార్టీ, వెడ్డింగ్​ యానివర్సరీ అయినా న్యూ ఇయర్​ వెల్​కమ్​ పార్టీ అయినా కేక్​ కట్​ చేయాల్సిందే. ఈ స్పెషల్​ అకేషన్స్​ కోసం కొందరు స్పెషల్​గా ఇంట్లోనే కేక్స్​ తయారు చేసుకుంటారు. తీరా కేక్​ ప్రిపరేషన్​ మొదలుపెట్టాక... కావాల్సిన టూల్స్​ లేక ఇబ్బంది పడతారు. అలాకాకుండా ఉండాలంటే కేక్​ తయారుచేసేముందే ఈ టూల్స్​ ఇంట్లో ఉన్నాయో, లేదో చూసుకోవాలి.

థర్మామీటర్​

కేక్​ ఫర్ఫెక్ట్​గా రావాలంటే.. ఒవెన్​లో ఎంత సేపు పెట్టాలి? ఏ టెంపరేచర్​ ఉండాలి? అనేది చాలా ముఖ్యం. అందుకే టెంపరేచర్​ని తెలుసుకునేందుకు ఒవెన్ థర్మామీటర్ వాడాలి. వీటిని చాలా కంపెనీలు మార్కెట్​లోకి తీసుకొచ్చాయి. ఇవి 100 నుండి 600 డిగ్రీల ఫారెన్‌‌హీట్ టెంపరేచర్​ వరకు మెజర్​ చేస్తాయి. దీన్ని స్టెయిన్​లెస్​ స్టీల్​తో తయారుచేస్తారు. వేడికి పగలకుండా లేబొరేటరీ గ్లాస్ లెన్స్ వాడతారు. దీన్ని ఒవెన్ షెల్ఫ్​లో పెట్టొచ్చు. లేదా రాక్​కి వేలాడదీయొచ్చు. ధర: 279 రూపాయల నుంచి మొదలు

పైపింగ్​ నాజిల్స్​

బేకరీల్లో కేక్స్​ మీద రకరకాల డిజైన్లు కనిపిస్తుంటాయి. ఇంట్లో తయారుచేసుకున్న కేక్​ మీద కూడా అలాంటి డిజైన్స్​ వేసుకోవచ్చు. కాకపోతే.. అందుకోసం కోన్​ షేప్​ కవర్​, నాజిల్స్​ అవసరం. మార్కెట్​లో చాలా కంపెనీలు వీటిని అమ్ముతున్నాయి. ఈ సెట్​లో వివిధ డిజైన్లతో 36 రకాల నాజిల్స్​తోపాటు కోన్​ ఆకారంలో ప్లాస్టిక్​ కవర్లు కూడా వస్తాయి. ధర: 169 రూపాయల నుంచి మొదలు

కట్టర్​

ఇంట్లో కేక్​ కట్​ చేసిన ప్రతిసారి చిన్న చిన్న ముక్కలు కింద పడుతుంటాయి. చాలావరకు అందుబాటులో ఉన్న చాకు​తో కేక్​ కట్​ చేస్తుంటారు. కట్​ చేసిన ఆ కేక్​ ముక్కను చేత్తో తీసి ప్లేట్​లో వేసేలోపు విరిగిపోతుంటుంది. లేదంటే క్రీమ్​ ఊడిపోయి కింద పడుతుంది. అలాంటప్పుడు ఈ అడ్జెస్టబుల్​ కేక్​ కట్టర్​ని వాడాలి. దీంతో కేక్​ ముక్కలు సమానంగా కట్​ చేయొచ్చు. కట్​ చేసిన ముక్కను చేత్తో తీసే అవసరం లేకుండా దాంట్లోనే హోల్డ్​ చేసి ప్లేట్​లో పెట్టొచ్చు. అంతేకాదు.. దీంతో కేక్​ను లేయర్లుగా కూడా కట్​ చేసుకోవచ్చు. ధర : 135 రూపాయల నుంచి మొదలు

లేయర్స్​

ఢిపరెంట్​ ఫ్లేవర్స్​ కోసం కేక్ మధ్యలో ఫ్లేవర్డ్​ క్రీమ్స్​ కలపాల్సి ఉంటుంది. కానీ.. కేక్​ని సన్న ముక్కలుగా కోయడం అంత ఈజీ కాదు. ఆ పనిని ఈజీగా చేసేందుకు ప్రత్యేకంగా కేక్​ స్లైసింగ్​ కిట్​లు దొరుకుతాయి. ఈ కిట్​లో ఉండే రింగ్​లో కేక్​ పెట్టి, కేక్ నైఫ్​తో ఆరు సమాన లేయర్స్​గా కట్​చేసుకోవచ్చు. కేక్​ లిఫ్టర్​తో లేయర్​ని తీసి, మధ్యలో బటర్‌‌క్రీమ్, చాక్లెట్, ఐసింగ్, మాస్కార్పోన్ విప్డ్ క్రీమ్‌‌ లాంటివి అప్లై చేసుకోవచ్చు.  ధర: 1,000 రూపాయల నుంచి మొదలు

- నిర్వహణ: కరుణాకర్