హైదరాబాద్: తెలంగాణ మహిళా కమిషన్ చైర్మెన్‌గా గద్వాల విజయ లక్ష్మీ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు సోమవారం (మే 11) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్‌తో పాటు ఆరుగురు కమిషన్ సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. వీరంతా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని జీవోలో స్పష్టం చేసింది ప్రభుత్వం.
మహిళా కమిషన్‌లో తెలంగాణ ఉద్యమకారులకు ప్రియారిటీ ఇచ్చింది ప్రభుత్వం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన ఉద్యమకారుడు శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మను ప్రభుత్వం మహిళా కమిషన్ మెంబర్‌గా అపాయింట్ చేసింది. అలాగే, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతకు కూడా మహిళా కమిషన్ సభ్యురాలుగా అవకాశం కల్పించింది ప్రభుత్వం.
