హీరోగా గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు

హీరోగా గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు

బళ్లారి కింగ్, మైనింగ్ లెజెండ్ గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. త్వరలోనే ఆయన హీరోగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం ఓ సినిమాను తెరకెక్కించబోతోంది. హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లతో పాటు కంటెంట్ ఆధారిత సినిమాలను రూపొందించడంలో పేరుగాంచిన రాధా కృష్ణ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషలలో ఈ చిత్రం రానుంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటీనటులు నటించనున్నారు. ఈ సినిమా కోసం అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులను కూడా ఎంచుకున్నారు.

సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. బాహుబలి లెన్స్‌మెన్ కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్‎గా పనిచేస్తుండగా.. టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్ మార్చి 4న గ్రాండ్‎గా జరగనుంది.