అబద్ధపు వార్తలతో గాంధీ ఆస్పత్రిని బద్నాం చేయొద్దు

అబద్ధపు వార్తలతో గాంధీ ఆస్పత్రిని బద్నాం చేయొద్దు

 సికింద్రాబాద్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో గురువారంరోజున భాను(18)అనే యువకుడు బ్రతికి ఉండగానే చనిపోయాడంటూ  డాక్టర్లపై నిందలు మోపి వార్తలు ప్రసారం చేయడం, ప్రింట్ చేయడంపై హాస్పిటల్ స్పందించింది. కొన్ని మీడియా, దినపత్రికల్లో వచ్చిన న్యూస్ పై … గాంధీ ఆస్పత్రి సూపరిండెండ్ శ్రావణ్ కుమార్ వివరణ ఇచ్చారు. గాంధీలో ఎమర్జెన్సీ వార్డులో బాధితుడికి ట్రీట్ మెంట్ జరుగుతుండగా.. అపోహలు నమ్మి ఆసుపత్రి డాక్టర్లను బద్నాం చేశారని ఆయన అన్నారు. ఇలాంటి కేసుల్లో.. పేషెంట్ చనిపోతే నిర్ధారణ కోసం మూడు ప్రాథమిక టెస్టులు చేస్తారని చెప్పారు. ఆ తర్వాతే కేస్ షీట్ ప్రిపేర్ చేసి డెత్ అయినట్టుగా డిక్లేర్ చేస్తామన్నారు. అలాంటిది ఏది జరగకుండానే బతికి ఉన్న యువకుడిని చనిపోయాడని డాక్టర్లు సర్టిఫై చేశారంటూ వార్తలు ప్రసారం చేయడం బాధ కలిగించిందన్నారు సూపరిండెండ్ శ్రావణ్  కుమార్. గాంధీ ఆస్పత్రి వైద్యుల బృందం అందించిన సేవలు గిన్నిస్ బుక్ లో నమోదైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

బాను తండ్రి గాంధీ డాక్టర్ల తప్పేమీ లేదు అంటూ వ్రాసి ఇచ్చిన లేఖ