ఆగస్ట్ 13 న బెల్లంకొండ గణేష్  'స్వాతిముత్యం' 

ఆగస్ట్ 13 న బెల్లంకొండ గణేష్  'స్వాతిముత్యం' 

ఆకట్టుకుంటున్న విడుదల  తేదీ ప్రచార చిత్రం
ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రం''స్వాతిముత్యం'' 

గణేష్ బెల్లంకొండ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం స్వాతిముత్యం. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా లక్ష్మణ్.కె.కృష్ణ  దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.  అయితే ఈ చిత్రాన్ని ఆగస్టు 13 న  రిలీజ్ చేయాలని నిర్ణయించినట్లుగా నిర్మాత సూర్య దేవర నాగవంశీ తెలిపారు . 

"సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రం స్వాతిముత్యం. దర్శకుడు మాటల్లో చెప్పాలంటే స్వాతిముత్యం  లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల,ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి" అని తెలిపారు. 

కాగా ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

ఛాయా గ్రహణం: సూర్య
ఎడిటర్: నవీన్ నూలి
కళ: అవినాష్ కొల్ల
పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
రచన- దర్శకత్వం: లక్ష్మణ్.కె.కృష్ణ