- ముదిరాజ్ల ఓట్ల కోసం గంగపుత్రులకు అన్యాయం చేస్తారా?
- తెలంగాణ గంగపుత్ర చైతన్య సమితి
ఖైరతాబాద్, వెలుగు: మత్స్య పారిశ్రామిక సహకార ఫెడరేషన్ చైర్మన్ పదవిని గంగపుత్రులకే ఇవ్వాలని తెలంగాణ గంగపుత్ర చైతన్య సమితి డిమాండ్ చేసింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమితి అధ్యక్షుడు శంకర్ మీడియాతో మాట్లాడారు. చేపలు పట్టడంలో గంగపుత్రులకు ప్రాధాన్యం ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం తమను మోసగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జీఓ నం.45 ద్వారా ఇతర కులానికి చెందిన వ్యక్తిని నియమించారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. ముదిరాజ్ ఓట్ల కోసం గంగపుత్రులను అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్య భవనాల ముందు సోమవారం నిరసన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
తమకు న్యాయం జరిగేంతవరకు పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు శ్రీహరి, ధనరాజ్, సత్యనారాయణ, చంద్ర ప్రకాష్, సంగీత తదితరులు పాల్గొన్నారు.
