గంజాయి బ్యాచ్ వీరంగం ఆటో డ్రైవర్పై దాడి.. ఇండ్లపై రాళ్లు 

గంజాయి బ్యాచ్ వీరంగం ఆటో డ్రైవర్పై దాడి.. ఇండ్లపై రాళ్లు 

మెహిదీపట్నం, వెలుగు: జియాగూడలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. శనివారం రాత్రి గౌతమ్ మోడల్ స్కూల్ సమీపంలో బైక్​పై ఓవర్​స్పీడ్​తో వచ్చిన ఇద్దరు యువకులు.. ఓ ఆటో డ్రైవర్​తో గొడవకు దిగి అతనిపై దాడి చేయడమే కాకుండా ఆటోలోని వృద్ధులను కూడా భయభ్రాంతులకు గురిచేశారు. దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానికులపై దాడులు చేశారు. 

అనంతరం తమ గ్యాంగ్​తో కలిసి వచ్చి స్థానిక ఇండ్లపైకి రాళ్లు రువ్వుతూ లోపలికి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ భయానక దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.