V6 News

లేబర్ క్యాంపులో గంజాయి..వెస్ట్ బెంగాల్ వాసి అరెస్ట్

లేబర్ క్యాంపులో గంజాయి..వెస్ట్ బెంగాల్ వాసి అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్​లో గంజాయి అమ్ముతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వెస్ట్​ బెంగాల్​కు చెందిన మధుసుదన్​హవల్దార్​(23) నగరానికి వలస వచ్చి గోపన్​పల్లి ఎన్టీఆర్​నగర్​లోని అపర్ణ లేబర్​ క్యాంపులో ఉంటూ లేబర్​గా పనిచేస్తున్నాడు. పక్కా సమాచారంతో గచ్చిబౌలి పోలీసులు శుక్రవారం అపర్ణ లేబర్​ క్యాంపులో తనిఖీలు చేపట్టగా.. మధుసుదన్​పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని రూమ్​లో తనిఖీ చేయగా, 1.523 కేజీల గంజాయి పట్టుబడింది.