భద్రాచలం ఆలయంలో కన్నుల పండువగా గరుడాధివాసం

భద్రాచలం ఆలయంలో  కన్నుల పండువగా గరుడాధివాసం

భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాగశాలలో ద్వార తోరణాలకు పూజలు, నిత్య హోమం నిర్వహించారు. గరుడాధివాసం కోసం అగ్నిని సమీకరించి ఆరాధించారు. కుంభం, బింబం, మండలాలకు అర్చన చేశారు. స్థానిక చినజీయర్‍మఠంలో తెల్లని వస్త్రంపై ధ్వజపటాన్ని లిఖించారు. 

అనంతరం యాగశాలలో ఈ గరుడాధివాసం వేదోక్తంగా జరిగింది. అహోబిల రామానుజ జీయర్ స్వామి, ఈవో దామోదర్​రావు, అర్చకులు పాల్గొని గరుత్మంతుడి చిత్రపటానికి ప్రత్యేక హారతులిచ్చారు. అంతకుముందు సిద్దిపేట జిల్లా గజ్వేల్​ శ్రీరామకోటి సంస్థ 300 కిలోల గోటితలంబ్రాలను ఈవోకు అందజేశారు. -భద్రాచలం, వెలుగు