ప్రమాదవశాత్తు పేలిన గ్యాస్ సిలిండర్.. ముగ్గురికి తీవ్ర గాయాలు

ప్రమాదవశాత్తు పేలిన గ్యాస్ సిలిండర్.. ముగ్గురికి తీవ్ర గాయాలు

యైటింక్లైన్ కాలనీ: పిండివంటలు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ సంఘ‌ట‌న సోమ‌వారం రామ‌గుండం సింగ‌రేణి కాలనీలోని టి2-80 క్వార్టర్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…సింగరేణి సంస్థ రామగుండం రీజియన్-3 ఓ.సి.పి-1లో ఫిట్టర్ గా విధులు నిర్వహిస్తున్న పొన్నం రాజీ రెడ్డి టి2-80లో కుటుంభం సభ్యులతో నివాసముంటున్నాడు. సోమవారం రాజిరెడ్డి భార్య సరోజిని, ఇంటి వెనుకాల ఉన్న సన్నిహితురాలు వ‌న‌మ‌లతో కలిసి ఇంట్లో పిండి వంటలు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ నుండి మంటలు చెలరేగాయి.

అదే సమయంలో ఇంట్లో ఉన్న సరోజిని కుమారుడు శరత్ మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసాడు.కానీ మంటలు తీవ్రం కావడంతో అదుపు చేయలేకపోయాడు. ఇరుగుపొరుగు పరిస్థితిని గమనించి వారిని ఇంటి నుండి బయటకు తీసుకువచ్చారు. కాగా ఈ ఘటనలో సరోజిని, వనమలకు స్వల్ప గాయాలు కాగా శరత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సింగరేణి రెస్క్యూ టీమ్ సకాలంలో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. సంఘటన స్థలానికి గోదావరిఖని టూ టౌన్ సి.ఐ కె.శ్రీనివాస్ రావు, ఎస్సై మందాటి శ్రీనివాస్ లు చేరుకొని పరిస్థితిని సమీక్షించి గాయపడిన ముగ్గురినిగి సింగరేణి హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్ లో ప్రధమ చికిత్స అందించి ముగ్గురిని గోదావరిఖని ఏరియా హాస్పిటల్ కు తరలించారు.

ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో సింగరేణి రెస్క్యూ టీం సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదంతో పాటు ప్రాణాపాయం తప్పింది. గ్యాస్ సిలిండర్ నుండి మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా భయనకవాతవర్ణం చోటు చేసుకుంది. ఎలాంటి ప్రాణాపాయం జరుగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.