- కమర్షియల్ సిలిండర్ పెంపుతో ‘డొమెస్టిక్’ పక్కదారి
హైదరాబాద్సిటీ, వెలుగు : జంటనగరాల్లో గ్యాస్కష్టాలు తీరడం లేదు. గ్యాస్సరఫరాలో కొరతతో కంపెనీలు కోరినంత ఇండెంట్సరఫరా చేయడం లేదని డీలర్లు వాపోతున్నారు. దీంతో గ్యాస్డెలివరీ ఆలస్యమవుతోందంటున్నారు. ఇంతేకాకుండా కమర్షియల్ సిలిండర్ల ధర పెంపు ప్రభావం డొమెస్టిక్గ్యాస్వినియోగదారులపై పడుతోంది.
సోమవారం కమర్షియల్సిలిండర్ ధర రూ.66 వరకు పెరగ్గా, ప్రస్తుతధర రూ.3366 కు చేరింది. చాలా రోజుల నుంచే హోటళ్ల నిర్వాహకులు, టిఫిన్సెంటర్లు, హాస్టల్స్ఓనర్లు డొమెస్టిక్ సిలిండర్లను బ్లాక్లో కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీన్ని క్యాష్చేసుకునేందుకు కొందరు డీలర్లు నేరుగా సిలిండర్లను పక్కదారి పట్టిస్తుండగా, మరి కొందరు డెలివరీ బాయ్స్ద్వారా దందా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం డొమెస్టిక్సిలిండర్ధర రూ.965 ఉండగా కొందరు రూ.2వేలకు అమ్ముకుంటున్నారు.
రోజుకు బుకింగ్లు లక్షన్నర
గ్రేటర్పరిధిలో 30 లక్షల గ్యాస్కనెక్షన్లుండగా ఇంతకు ముందు రోజుకు 70 నుంచి 80 వేల బుకింగ్లు జరిగేవి. కానీ, ప్రస్తుతం ఈ సంఖ్య లక్షన్నరకు చేరుకుంది. అయితే, డెలివరీ మాత్రం 70 నుంచి 80 వేలకు మించడం లేదు. పెరిగిన బుకింగ్ తాకిడితో ఆయిల్కంపెనీలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి.
సింగిల్సిలిండర్ఉన్న వారు ఇంతకు ముందు ఒక సిలిండర్బుక్ చేసుకున్న తర్వాత మరో సిలిండర్బుక్చేయడానికి 20 రోజులు ఆగాల్సి వచ్చేది. కానీ, తాజాగా దాన్ని 25 రోజులు చేశారు. అలాగే డబుల్ సిలిండర్ఉన్న వారికి ఇంతకుముందు 25 రోజులు ఉంటే ..ఇప్పుడు దాన్ని 30 రోజులు చేశారు. మరోవైపు సిలిండర్బుక్చేస్తే వారంలో డెలివరీ ఉంటుందని మెసేజ్లు వస్తున్నాయి. కానీ, డెలివరీ అయ్యేసరికి రెండు వారాలు పడుతోంది. ఆలస్యమవుతోందని కొందరు వినియోగదారులు డీలర్లను సంప్రదిస్తే గ్యాస్సరఫరా సరిగ్గా లేదని, వెయిట్చేయక తప్పదని సమాధానం ఇస్తున్నారు.
