అబుదాబి: టీ20 స్పెషలిస్ట్‌లు… టీ10 లీగ్‌లో మెరవనున్నారు. వచ్చే ఏడాది జరిగే ఈ లీగ్‌లో యూనివర్స్బాస్ క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, షాహిద్ ఆఫ్రిది బరిలోకి దిగనున్నారు. టీమ్ అబుదాబి.. గేల్‌ను ఐకానిక్ ప్లేయర్‌గా తీసుకుంది. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరిగే ఈ లీగ్ మ్యాచ్‌లన్నీ.. అబుదాబి షేక్ జాయెద్ స్టేడియంలోనే జరుగనున్నాయి. టీ20 ఫార్మాట్‌లో వెయ్యికి పైగా సిక్సర్లు కొట్టిన గేల్.. టీ10 లీగ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. ‘షార్టెస్ట్ ఫార్మాట్ మరింత ఎక్సైటింగ్‌గా ఉంటుంది. జాయేద్ స్టేడియంలో మరోసారి ఆడేందుకు నేను వెయిట్ చేయలేను. ఎప్పుడెప్పుడు బరిలోకి దిగుదామా అని వేచి చూస్తున్నా. గేల్ స్టార్మ్ వచ్చేస్తోంది’ అని గేల్ పేర్కొన్నాడు. ఢిల్లీ బుల్స్ జట్టు బ్రావోను ఐకానిక్ ప్లేయర్‌గా ఎంచుకోగా, ఆఫ్రిది.. క్వాలాండర్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. రస్సెల్.. నార్తర్న్ వారియర్స్, నరైన్.. డెక్కన్ గ్లాడియేటర్స్ తరఫున బరిలోకి దిగనున్నారు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్.. మరాఠా అరేబియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

