ఎర్రవల్లిలో కొనసాగుతున్న ఎంజాయ్మెంట్  సర్వే 

ఎర్రవల్లిలో కొనసాగుతున్న ఎంజాయ్మెంట్  సర్వే 

సిద్దిపేట/ములుగు/కొండపాక, వెలుగు: సిద్దిపేట జిల్లా మర్కుక్  మండలంలోని మాజీ సీఎం కేసీఆర్  దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో 325 సర్వే నంబర్ లో రెండో రోజు అధికారులు భూములను సర్వే చేశారు. మొదటి రోజు 50 మంది రైతులకు సంబంధించి 100 ఎకరాలు సర్వే చేశారు. మిగిలిన రైతులకు సంబంధించి ఎంజాయ్​మెంట్  సర్వే రెండో రోజు కొనసాగింది.

బుధవారం సర్వే పూర్తి చేసి ఎంజాయ్​మెంట్  సర్వే నివేదికను అధికారులకు అందజేస్తామని సర్వేయర్లు తెలిపారు. కొండపాక మండలం వెలికట్ట గ్రామ శివారులోని 271 సర్వే నంబర్​లో రెవెన్యూ సిబ్బంది 4 టీమ్​లుగా ఏర్పడి మంగళవారం 327 ఎకరాల 9 గుంటల భూమిని సర్వే చేశారు.

హద్దులు నిర్ణయిస్తామని గజ్వేల్  ఆర్ఐ వంశీ తెలిపారు. ఈ సందర్భంగా సర్వే అధికారులు మాట్లాడుతూ భూ కొలతలు చేసి హద్దులు నిర్ధారించాక నివేదికను అధికారులకు ఇస్తామని తెలిపారు.