ముంబై: రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్లు, ఆడిట్ నివేదికల వెల్లడికి సంబంధించిన నిబంధనల ఉల్లంఘన ఆరోపణలను ఎదుర్కొంటున్న ఐదు అదానీ గ్రూప్ కంపెనీలపై సెబీ విచారణను పూర్తి చేసింది. రూ.1.5 కోట్లు చెల్లించడంతో సెటిల్‌మెంట్ చేసింది. అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలోని కార్పొరేట్ పాలన సమస్యల ఆధారంగా ఈ విచారణ జరిగింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీలు సెబీతో సెటిల్‌మెంట్ చేసుకున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ.76.05 లక్షలు, అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.45.50 లక్షలు చెల్లించాయి. మిగిలిన మూడు కంపెనీలు ఒక్కోటి రూ.9.75 లక్షలు చెల్లించాయి. సెబీ జూన్ 2026లో సిఫార్సు చేసిన నిబంధనలను ఆగస్టు 13న హోల్ టైమ్ మెంబర్ల ప్యానెల్ ఆమోదించింది. గౌతమ్ అదానీపై స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్ ఆరోపణలను గత ఏడాది సెబీ క్లియర్ చేసింది.
