ఇండియా షాక్ అయ్యింది.. పేరంట్స్ అందరూ వణికిపోయారు. 2026, ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం న్యూస్ చూసిన వాళ్లకు చెమటలు పట్టాయి.. కారణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌లో జరిగిన ఘటన.. అవును.. ముగ్గురు పిల్లలు.. వాళ్ల వయస్సు 16 ఏళ్లలోపే.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. భారీ అపార్ట్ మెంట్.. 9వ అంతస్తు నుంచి దూకేశారు.. స్పాట్ డెడ్.. ముగ్గురు అమ్మాయిలు.. చిన్న పిల్లలు.. ఇలా ఆత్మహత్య చేసుకోవటం ఏంటీ.. దీని వెనక గేమింగ్ యాప్ ఉందా.. ఆ గేమింగ్ యాప్ ఇచ్చిన టాస్క్ వల్లే.. ఈ ముగ్గురు చిన్న పిల్లలు ఇలా దూకేశారా.. ఇదే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. పేరంట్స్కు వణుకుపుట్టింది.. ఎందుకంటే ఇంట్లో పిల్లల చేతుల్లో మొబైల్స్ కామన్ కదా.. ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ALSO READ : ఇలాంటోళ్లు ఉంటే ఏంటి, పోతే ఏంటి..?
వివరాల ప్రకారం.. నిషిక (16), ప్రాచి (14), పాఖి (12) ముగ్గురు అక్కాచెల్లెలు. ఘజియాబాద్ జిల్లాలోని భారత్ సిటీ సొసైటీలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. బుధవారం (ఫిబ్రవరి 4) తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌లోని 9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, అపార్ట్మెంట్ సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే ముగ్గురు చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.
మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లల గది నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆన్ లైన్ గేమ్‌కు బానిసలయ్యే ముగ్గురు అక్కాచెల్లెలు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని ప్రాథమికంగా గుర్తించారు.
ALSO READ : 6 నెలల బిడ్డకు పాలు ఇస్తుండగా..
కొవిడ్19 మహమ్మారి టైమ్ నుంచి ఈ ముగ్గురూ టాస్క్ ఆధారిత 'కొరియన్ లవ్ గేమ్' అనే ఆన్‌లైన్ వీడియో గేమ్‌కు బానిసలయ్యారు. ఈ గేమ్ చివరి టాస్క్‌లోని ఆదేశాల మేరకే ముగ్గురు అక్కాచెల్లెలు బుధవారం తెల్లవారుజూమున ఒకేసారి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు అక్కాచెల్లెలు ఆన్ లైన్ గేమ్ బానిసై ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
