ఉత్తర్ ప్రదేశ్ లో విషాదం చోటుచేసుకుంది . విడాకుల తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిన ఓ మహిళా(మానసకి వైద్యురాలు ) సైకియాట్రిస్ట్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో సైకియాట్రిస్ట్ గా పనిచేస్తున్న 40 ఏళ్ల డాక్టర్ హేమికా అగర్వాల్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయారు. రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలోని ఆఫీసర్స్ సిటీ-2 సొసైటీలో గల ఐదో అంతస్తు అపార్ట్‌మెంట్ నుంచి ఆదివారం ఆమె కిందకు దూకడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
దాదాపు ఒకటిన్నర సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఆమె తీవ్రమైన డిప్రెషన్, మానసిక క్షోభతో బాధపడుతున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి తండ్రి డాక్టర్ ఆర్ చంద్ర స్వయంగా ఘజియాబాద్‌లో ప్రసిద్ధ మానసిక వైద్యుడే కావడం గమనార్హం. వివాహ బంధం తెగిపోయిన తర్వాత గత 18 నెలలుగా తన కూతురు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
►ALSO READ | ముంబైలో షాకింగ్ ఘటన.. కాజు కట్లీ తింటుండగా తుప్పు పట్టిన పిన్ను.. చిన్నారికి తప్పిన ప్రమాదం !
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేయడంతో పాటు సంఘటన స్థలంలోని ఆధారాలను పరిశీలిస్తున్నారు.
అయితే ఇప్పటివరకు ఎలాంటి సూసైడ్ నోట్ లభించినట్లు పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తులో వెల్లడయ్యే నిజాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
