వీధి కుక్కల దాడులు..స్కూళ్లల్లో జీహెచ్ఎంసీ అవగాహన

వీధి కుక్కల దాడులు..స్కూళ్లల్లో జీహెచ్ఎంసీ అవగాహన

వీధి కుక్కల దాడుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమయ్యింది. వీధి కుక్కలు దాడులు చేస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్స్, టీచర్లకు అవగాహన కల్పిస్తోంది. శనివారం  మూసాపేట్, గాజులరామారం, శేరిలింగంపల్లి  పాఠశాల విద్యార్థులకు భద్రత, నివారణ చర్యలపై జీహెచ్‌ఎంసీ అధికారులు అవగాహన కల్పించారు. వీధి కుక్కల దాడుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి  పాంప్లెంట్స్ పంపిణీ చేశారు.

వీధి కుక్కల దాడుల నివారణకు.. 

  • వీధి కుక్కలు దగ్గరకు వచ్చేంత వరకు స్పందించకూడదు
  • వీలైనంత వరకూ వాటికి దూరంగా ఉండాలి 
  • దగ్గరకు వచ్చిన కుక్కకు, మనకు మధ్యలో ఎదుర్కొనేందుకు ఏదైనా ఒక వస్తువు ఉండాలి
  • వీధి కుక్కల వద్ద బిగ్గరగా శబ్దాలు చేయకూడదు
  • పిల్లలతో ఉన్న తల్లి కుక్క దగ్గరకు అసలు వెళ్ళకూడదు
  • వీధి కుక్కలను ముట్టుకోకుండా వాటితో ఫ్రెండ్లీగా ఉండాలి
  • గుంపుగా ఉన్న వీధి కుక్కలకు వీలైనంత దూరంగా ఉండాలి
  • తింటున్న, పడుకున్న వీధి కుక్కలను డిస్టర్బ్ చేయకూడదు