ఆ పాటను కీరవాణికి ఇవ్వొద్దంటూ .. తెలంగాణ సినీ మ్యుజీషియన్స్ సీఎంకు లేఖ

 ఆ పాటను కీరవాణికి ఇవ్వొద్దంటూ ..  తెలంగాణ సినీ మ్యుజీషియన్స్ సీఎంకు లేఖ

‘జయజయహే తెలంగాణ’ పాటకు కీరవాణిని సంగీతం అందించమనడం చారిత్రక తప్పిదమని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి  తెలంగాణ సినీ మ్యుజీషియన్స్ అసోసియేషన్ లేఖ రాసింది. ‘గత ప్రభుత్వం ఈ పాట విషయంలో ఎన్నో తప్పులు చేసింది. రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఈ పాట ప్రజలకు ఎంతో చేరువైయ్యింది. అలాంటి పాటని గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం. ఈ పాట కొందరు తెలంగాణ రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో నలిగి నలిగి చచ్చిపోయింది.  మళ్ళీ మీ వల్ల పుట్టి పురుడు పోసుకుంటున్న శుభ తరుణమిది. ఈ పాటని బతికిస్తున్నందుకు ధన్యవాదాలు. మన ఉద్యోగాలు మనకే రావాలని, మన అవకాశాలు మనకే కావాలనే నినాదంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాలవారు పాడటం ఏంటి? అలా చేయడమంటే తెలంగాణ కళాకారులను అవమానించడమే. ఈ గొప్ప అవకాశం మనవాళ్లకే ఇవ్వాలి’ అని సీఎంను కోరారు.