ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. డెలివరీ బాయ్ ప్లాన్ తెలిస్తే షాక్

ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. డెలివరీ బాయ్ ప్లాన్ తెలిస్తే షాక్

సికింద్రాబాద్: స్విగీ డెలివరీ బాయ్ ఘరానా మోసం బయటపడింది. హోటల్ లో ఫుడ్ డెలివరీలు ఎన్ని రోజులు కొడతాం లే అని అనుకున్నాడు ఓ స్విగ్గీ డెలివరీ బాయ్.. సేమ్ పేరుతో ఓ ఫేక్ హోటల్‌ను తెరిచాడు. కార్ఖాన పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మోసం బయట పడింది. సికింద్రాబాద్ ఏరియాలో ఉంటూ సందీప్ అనే యువకుడు ఫుడ్ డెలివరీలు చేస్తుంటాడు. గ్రిల్ 9 హోటల్ పేరుతో మరో ఫేక్ హోటల్ క్రియేట్ చేశాడు. 

నకిలీ పాన్ కార్డు, నకిలీ జీఎస్టీ, ఫుడ్ లైసెన్స్ తో గ్రిల్ 9 హోటల్ పేరు మీదనే మరో అకౌంట్ ఓపెన్ చేశాడు సందీప్. ఓరిజినల్ గ్రిల్ 9 హోటల్ నుండి స్విగ్గీ ద్వారా సందీప్ ఫుడ్ ఆర్డర్స్ తీసుకెళ్తున్నాడు.. డబ్బులు మాత్రం హోటల్ అకౌంట్ లో జమ కాట్లేదు.   స్విగ్గీలో తరహానే జోమాటోలో కూడా మోసం చేయడానికి సందీప్ ప్రయత్నించాడు. గ్రిల్ 9 యజమాని మారుతున్నట్లు జోమటో నుండి మేసేజ్ రావడంతో యజమాని అప్రమత్తం అయ్యాడు.

అనుమానం వచ్చిన హోటల్ యాజమాన్యం పరిశీలించగా డబ్బులు దారి మల్లినట్లు గుర్తించారు. తీగ లాగితే డొంక కదిలినట్లుగా సందీప్ వ్యవహారం మొత్తం బయటపడింది. హోటల్ సిబ్బంది కార్ఖాన పోలీసులను ఆశ్రయించగా.. అప్పటికే సందీప్ పరార్ అయ్యాడు. రంజాన్ నుంచి ఇలా రోజుకు పదుల సంఖ్యలో అర్డర్ల డబ్బులు దారిమళ్లిస్తున్నట్లు హోటల్ యాజమాన్యం పోలీసులు తెలిపారు. లక్షల్లో లాస్ వచ్చిందని ఫిర్యాదులో పేర్కోన్నాడు. పరారైన సందీప్ ను పోలీసులు పట్టుకొని రిమాండ్ కు తరలించారు.  స్విగ్గీ సర్వీస్ పైన కూడా కేసు పెట్టారు.