సూరారంలో రూ.8.40 లక్షల విలువైన హ్యాష్ ఆయిల్ సీజ్

సూరారంలో రూ.8.40 లక్షల విలువైన హ్యాష్ ఆయిల్ సీజ్

హాష్ ఆయిల్ తరలిస్తున్న ముగ్గురిని మేడ్చల్ జిల్లా సూరారం పోలీసులు పట్టుకున్నారు. నిందితులు ఉదయ్ కిరణ్, శ్రవణ్ కుమార్, బుద్ధరాజ్ లు యాక్టివాపై వెళ్తుం డగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని ఆపారు. వెహికల్ డిక్కీలో ప్లాస్టిక్ కవర్లో ఉన్న హాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. దొరికిన మత్తు పదార్ధం విలువ 8 లక్షల 40 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒడిశా రాష్ట్రం కొరాపుట్ నుంచి ఈ మాదక ద్రవ్యాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్లు పోలీసులు తెలుసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు పంపారు పోలీసులు.