పోస్టాఫీసులో మంత్లీ ఇన్ కమ్ స్కీమ్.. నెలనెలా రూ.9వేలు పొందొచ్చు.. వివరాలివిగో

పోస్టాఫీసులో మంత్లీ ఇన్ కమ్ స్కీమ్.. నెలనెలా రూ.9వేలు పొందొచ్చు.. వివరాలివిగో

డబ్బు ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో అందరికి తెలుసు..భవిష్యత్ గురించి ఆలోంచించేవారు డబ్బును ఆదా చేసేందుకు ఇష్టపడతారు.  కొంతమంది దీర్ఘకాలంలోె ఎక్కువ మొత్తం కోసం సేవింగ్స్ చేస్తే.. కొంతమంది ప్రతి నెలా కొంత ఆదాయం ఉండేలా సేవింగ్స్ చేస్తుంటారు.. ఇలాంటి వారికోసం నేషనల్ సేవింగ్స్ స్కీంలు చాలా అందుబాటులో ఉన్నాయి. అటువంటి వాటిలో పోస్టాఫీస్ మంత్రీ ఇన్ కమ్ అకౌంట్ అనేది బెస్ట్ ఆప్షన్.. ఆకర్షణీయమైన వడ్డీరేట్లు, ప్రభుత్వ సెక్యూరిటీ ఉంటుంది. ఈ పథకంలో మీ పెట్టుబడులు మంత్లీ ఇన్ కమ్ గా ఎలా మీకు ఆదాయాన్ని అందిస్తాయో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..
 
అందరి ఆర్థిక అవసరాలు ఒకేలా ఉండవు. కొందరు దీర్ఘకాలంలో లంప్‌సమ్‌ అమౌంట్‌ కోరుకుంటే, కొందరు ప్రతి నెలా ఆదాయం చేతికందితే బావుంటుందని భావిస్తారు. మీరు ఇలాంటి ఆప్షన్‌ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (POMIS) బెస్ట్‌ ఆప్షన్‌ అవతుంది. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ప్రభుత్వ మద్దతు అందిస్తుంది. ఈ పథకం మీ పెట్టుబడులను మంత్లీ ఇన్‌కమ్‌ సోర్స్‌గా ఎలా మారుస్తుందో? ఇప్పుడు తెలుసుకుందాం.

నేషనల్ సేవింగ్స్‌ స్కీమ్‌ని సురక్షితమైనదిగా ప్రజలు నమ్ముతారు. పోస్టాఫీస్‌ నేషనల్ సేవింగ్స్ (మంత్లీ ఇన్‌కమ్‌ అకౌంట్‌) పథకం (MIS) ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్‌. ఇది ప్రజలకు స్థిరమైన వడ్డీ రేటు, నెలవారీ ఆదాయాలను అందిస్తుంది.

POMIS స్కీంకు అర్హులు ఎవరంటే.. 

POMIS పథకం అందరికి అందుబాటులో ఉంది. సింగిల్‌, జాయింట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. ముగ్గురు పెద్దలకు జాయింట్‌ అకౌంట్‌ అందుబాటులో ఉంటుంది. మైనర్‌లు లేదా సొంతంగా ఆర్థిక వ్యవహారాలు నిర్వహించలేని వారి కోసం గార్డియన్లు అకౌంట్‌ మేనేజ్‌ చేయవచ్చు. 10 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు పేరు మీద POMISతో అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు.


వడ్డీ రేట్లు ఎలా ఉంటాయంటే..

అకౌంట్‌ ఓపెన్‌ చేసిన తేదీ నుంచి నెల పూర్తయిన తర్వాత నుంచి మెచ్యూరిటీ వరకు వడ్డీ అందుకుంటారు. ప్రతి నెలా అందుకోవాల్సిన వడ్డీని అకౌంట్‌ హోల్డర్‌ క్లెయిమ్ చేయకపోతే..అకౌంట్‌లో ఉండే అటువంటి వడ్డీపై ఎటువంటి అదనపు వడ్డీ లభించదని గుర్తించాలి. అనుకోకుండా ఎక్కువ డబ్బు ఇన్వెస్ట్‌ చేస్తే, ఆ మొత్తాన్ని తిరిగి పొందుతారు. వడ్డీ ఆటోమేటిక్‌గా సేవింగ్స్‌ అకౌంట్‌లో క్రెడిట్‌  అవుతుంది. ఈ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి వస్తుంది.

ఎలా డిపాజిట్ చేయాలి 

ఈ పస్కీంలో మినిమం రూ.1000 లతో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. గరిష్టంగా సింగిల్ అకౌంట్ అయితే రూ.9లక్షలు, జాయింట్ అకౌంట్ అయితే రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. జాయింట్ అకౌంట్ లోని ఉన్న వారందిరికి పెట్టుబడిలో సగభాగం ఉంటుంది. ఒక వ్యక్తి ఓపెన్ చేసిన అన్ని అకౌంట్స్ లో కూడా పెట్టబడి మొత్తం రూ. 9లక్షలు మించకూడదు. మైనర్ తరపున గార్డియన్ గా ఉంటే ఆ అకౌంట్ లిమిట్ వేరుగా ఉంటుంది. 

ప్రీమెచ్యూర్‌ క్లోజ్‌

డిపాజిట్ తేదీ నుంచి ఒక సంవత్సరం వరకు డిపాజిట్ ను విత్ డ్రా చేయడానికి వీలు లేదు. అకౌంట్ తెరిచిన తేదీ నుంచి 1 సంవత్సరం తర్వాత లేదా 3 సంవత్సరాలకు ముందు అకౌంట్ క్టోజ్ చేస్తే ప్రిన్సిపుల్ అమౌంట్ నుంచి 2 శాతం కట్ చేస్తారు. 3 ఏళ్ల తర్వాత 5ఏళ్లలోపు అయతే 1శాతం వసూలు చేస్తారు. సంబంధిత పోస్టాఫీసులో పాస్‌బుక్‌, సంబంధిత అప్లికేషన్‌ ఫామ్‌ను సమర్పించడం ద్వారా అకౌంట్‌ను ప్రీమెచ్యూర్‌గా క్లోజ్‌ చేయవచ్చు.

మెచ్యూరిటీ

సంబంధిత పోస్టాఫీసులో పాస్‌బుక్‌, అప్లికేషన్‌ ఫామ్‌ అందజేయడం ద్వారా 5 సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత అకౌంట్‌ క్లోజ్‌ చేసుకోవచ్చు. అకౌంట్‌ హోల్డర్ మెచ్యూరిటీకి ముందే మరణిస్తే కూడా క్లోజ్‌ చేయవచ్చు. నామినీ/చట్టపరమైన వారసులకు మొత్తం తిరిగి చెల్లిస్తారు. రీఫండ్‌ చేసిన ముందు నెల వరకు వడ్డీ చెల్లిస్తారు. రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ. 9250 వరకు వడ్డీ రూపంలో పొందొచ్చు. మెచ్యూరిటీ తర్వాత మీ డబ్బులు మీకు వస్తాయి.