 
                                    మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన అతిథ్య ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత ఓపెనర్ అభిషేక్ ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 37 బంతుల్లో 68 పరుగులు చేయగా.. హర్షిత్ రాణా 35 పరుగులు చేసి టీమిండియాను ఆదుకున్నారు. అభిషేక్, హర్షిత్ తప్పా.. మిగిలిన ఇండియా బ్యాటర్స్ అంతా సింగిల్ డిజిట్‌కే ఔట్ కావడం భారత్ ఓటమికి కారణమైంది.
ఇండియా మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఒక సంవత్సరంలో అత్యధిక సిక్సులు (43) కొట్టిన ఆటగాడిగా అభిషేక్ రేర్ ఫీట్ నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ పాక్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌ను పేరిట ఉండేది. రిజ్వాన్ 2021లో 42 సిక్సర్లు బాదగా.. 2025లో అభిషేక్ 43 సిక్సుర్లు బాది రిజ్వాన్ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు.
ఒక సంవత్సరంలో T20I లలో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడు (పూర్తి సభ్య దేశం)
- 43 - అభిషేక్ శర్మ (భారతదేశం), 14 ఇన్నింగ్స్‌లలో (2025)
- 42 - మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్), 26 ఇన్నింగ్స్‌లలో (2021)
- 41 - మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్), 18 ఇన్నింగ్స్‌లలో (2021)
- 37 - ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్), 18 ఇన్నింగ్స్‌లలో (2021)
- 36 - కెవిన్ ఓ'బ్రియన్ (ఐర్లాండ్), 23 ఇన్నింగ్స్‌లలో (2019)

 
         
                     
                     
                    