హైదరాబాద్ మూన్ షైన్ పబ్ పై ఈగల్ టీం రైడ్స్... ముగ్గురు అరెస్ట్..

హైదరాబాద్ మూన్ షైన్ పబ్ పై ఈగల్ టీం రైడ్స్... ముగ్గురు అరెస్ట్..

హైదరాబాద్ లో పబ్ కల్చర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల పబ్స్ లో డ్రగ్స్ వినియోగం ఎక్కువైపోతోంది. తరచూ పబ్స్ లో పోలీసుల తనిఖీల్లో డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్ములన కోసం ఏర్పాటు చేసిన ఈగల్ టీం దూకుడు పెంచింది. సిటీలోని పబ్స్ లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ డ్రగ్స్ ను కట్టడి చేస్తోంది ఈగల్ టీం. ఈ క్రమంలో శనివారం ( నవంబర్ 1 ) హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న మూన్ షైన్ పబ్ లో తనిఖీలు నిర్వహించింది ఈగల్ టీం. ఈ తనిఖీల్లో డ్రగ్స్ సేవించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలిసులు.

మూన్ షైన్ పబ్ పై తనిఖీలు నిర్వహించిన ఈగల్ టీం పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. ఈ క్రమంలో దినేష్ కుమార్, భగదూర్ రోహిత్ సింగ్, బండా సంతోష్ అనే ముగ్గురు కన్స్యూమర్లను అదుపులోకి తీసుకుంది ఈగల్ టీం. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని ఫిలిం నగర్ పోలీసులకు అప్పగించింది ఈగల్ టీం.

►ALSO READ | బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. అందుకే బీజేపీ డమ్మీ అభ్యర్థిని పెట్టింది: పీసీసీ చీఫ్

ఇదిలా ఉండగా.. సికింద్రాబాద్ బొల్లారంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు ఈగల్ టీం పోలీసులు. సికింద్రాబాద్ బొల్లారం చెక్ పోస్ట్ దగ్గర నిర్వహించిన తనిఖీలో డ్రగ్స్ తో పట్టుబడిన శుభం కుమార్ సింగ్, శివ నందం కురుప్ లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.వీరి దగ్గర నుంచి 20గ్రాముల MDMA, రెండు గ్రాముల కొకైన్,100 గ్రాముల ఓజి,12 ఎల్ ఎస్ డి బ్లడ్స్, 48 నగదుతో పాటు కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.