బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. అందుకే బీజేపీ డమ్మీ అభ్యర్థిని పెట్టింది: పీసీసీ చీఫ్

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. అందుకే బీజేపీ డమ్మీ అభ్యర్థిని పెట్టింది: పీసీసీ చీఫ్

బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటేనని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గత ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సాయం చేసిందని.. ఆ రుణాన్ని బీజేపీ ఇప్పుడు తీర్చుకుంటుందని ఆరోపించారు. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికలో బీజేపీ డమ్మీ క్యాండిడేట్ ను పెట్టిందని విమర్శించారు. 

శనివారం (నవంబర్ 01) యూసుఫ్ గూడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ సందర్భంగా ఆయన బీజేపీ, బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఫేక్ హామీలతో మోసం చేసిందని అన్నారు. ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చారో చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షల రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పారు. ఐదేండ్లు మీ మంత్రి వర్గంలో మహిళా మంత్రి ఎందుకు లేరో చెప్పాలని ప్రశ్నించారు. 

►ALSO READ | జూబ్లీహిల్స్ పై బస్తీ మే సవాల్..! బాకీ కార్డు X చార్జి షీట్ X ఫైవ్ ఫ్యాక్టర్స్..

రెండు పార్టీల మధ్య ఉన్న లోపాయి కారి ఒప్పందంతోనే బీజేపీ డమ్మీ అభ్యర్థిని పెట్టిందని ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తే విమర్శిచడేంటని మండిపడ్డారు.