Pawan Kalyan: కేరళ అడవుల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' క్లైమాక్స్ షూట్.. పవర్ స్టార్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Pawan Kalyan: కేరళ అడవుల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' క్లైమాక్స్ షూట్.. పవర్ స్టార్ ప్లాన్ మామూలుగా లేదుగా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' .  డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గబ్బర్ సింగ్ వంటి హిట్ తర్వాత వస్తున్న వీరి రెండో చిత్రం ఇది. లెటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రం తన చివరి షూటింగ్ షెడ్యూల్ కోసం కేరళకు పయనమతోంది. 

కేరళ అడవుల్లో కీలక షెడ్యూల్.. 

ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాలను కేరళలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది. డిసెంబర్ 19 నుంచి 22 వరకు ఈ షెడ్యూల్ జరగనుందని సమాచారం. సినిమా కథలో భాగంగా వచ్చే కొన్ని ఇంటెన్స్ ఫారెస్ట్ సీన్స్ కోసం మేకర్స్ కేరళ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నారు. అయితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన పార్ట్ షూటింగ్‌ను పూర్తి చేయడంతో ఆయన ఈ షెడ్యూల్‌లో పాల్గొనడం లేదు. ఇతర ప్రధాన తారాగణంపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను దర్శకుడు హరీష్ శంకర్ ఇక్కడ చిత్రీకరించబోతున్నారు తెలుస్తోంది.

ఏప్రిల్‌లో బాక్సాఫీస్ వద్ద తాండవం!

మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.  పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ తన అభిమానుల కోసం ఈ సినిమాను అత్యంత వేగంగా పూర్తి చేశారు. ఈ చిత్రంలో పవన్ సరసన టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల,రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు.

బ్లాక్ బస్టర్ దిశగా..

ఇటీవలే రాజమండ్రిలో గ్రాండ్‌గా విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఈ మాస్ బీట్, పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఈసారి కేవలం వినోదం మాత్రమే కాదు, పవర్ స్టార్ మార్క్ పవర్ ఫుల్ మెసేజ్ కూడా ఉంటుంది అని హింట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా పదునైన డైలాగ్స్‌ను హరీష్ శంకర్ సిద్ధం చేశారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ మరోసారి ఖాకీ డ్రెస్ వేస్తుండటంతో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అని అభిమానులు అంచనా వేస్తున్నారు.

కేరళ షెడ్యూల్ ముగియగానే, చిత్ర యూనిట్ పూర్తిస్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించనుంది. ఏప్రిల్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్‌తో అభిమానులను ఖుషీ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఎన్నో అంచనాలతో వస్తున్న పవన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తోందో చూడాలి మరి.