వాకిటికి అందం.. రంగు రంగుల ముగ్గు.. ధనుర్మాసంలో సంక్రాంతి ముగ్గు.. ఇంటికి కళ

 వాకిటికి అందం.. రంగు రంగుల ముగ్గు.. ధనుర్మాసంలో సంక్రాంతి ముగ్గు.. ఇంటికి కళ

ధనుర్మాసం వచ్చేసింది.. సంక్రాంతి ముగ్గులకు వేళయింది.  నిత్యం రోజుకొక వెరైటీ ముగ్గుతో వాకిళ్లను  రంగు రంగులతో తీర్చి దిద్దుతారు.  వాటిమధ్యలో గొబ్బెమ్మలు పెడితే ఇక ఆ వాకిటి అందమే వేరుగా ఉంటుంది. ఇలా ఉంటే  వాకిట్లో ముగ్గు ఉందంటే ఆ ఇల్లు సంతోషాలతో కళకళలాడుతూ ఉందని అర్ధం. ధనుర్మాస కళ ముగ్గులతోనే మొదలవుతుంది. ఎన్నో ఆనందాలను మూటకట్టి తెస్తుంది సంక్రాంతి. అందుకే వీధుల్లోని ముగ్గులన్నీ వింత రంగులు పులుముకొని సంక్రాంతి లక్ష్మికి ఆహ్వానం పలుకుతాయి అందాల ముగ్గులు..