కలియుగ దైవం.. వెంకటేశ్వరస్వామికే నామాలు పెడతారా.. ప్రైవేట్ సంస్థకు దేవుడు భూములు ఎలా ఇస్తారు..!

కలియుగ దైవం.. వెంకటేశ్వరస్వామికే నామాలు పెడతారా.. ప్రైవేట్ సంస్థకు దేవుడు భూములు ఎలా ఇస్తారు..!

తిరుమల.. తిరుపతి (టీటీడీ) ఆస్తులను కాపాడటంలో ఏపీ సీఎం చంద్రబాబు  ఘోరంగా విఫలమయ్యారని టీటీడీ మాజీ చైర్మన్​  భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. దేవుడి భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెడుతూ టీటీడీ  తీరని ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. 

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆనాడు తీసుకు వచ్చిన ఏడు కొండలు పరిధిలో ఉన్న  భూములను ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేట్​ వ్యక్తులకు దారాదత్తం చేస్తుందని భూమన మండిపడ్డారు.  కలియుగ దేవుడైన  తిరుమల వెంకటేశ్వర స్వామికే మూడు నామాలు పెడతారా? జిల్లాకలెక్టర్ కూడా నైతిక బాధ్యత వహించాలి. అలిపిరి వద్ద అనుమతులు లేకుండా అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి? ఎర్ర చందనం దుంగలు ఏమయ్యాయి.. వీటికిసమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.

టూరిజం  భూమిని ఒబెరాయ్ గ్రూప్ నకు కట్టబెట్టడం దారుణం అంటూ ..  అలిరిపికి అతి సమీపంలో భూములు కేటాయిస్తూ.. 2025 డిసెంబర్​  11 తేదీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని ... జీవోఇచ్చి  ...  ఈనెల 5 తేదీన రిజిస్ట్రేషన్ చేశారు ..కాని ఆ జీవోను.. రిజిష్ట్రేషన్​ డాక్యుమెంట్​ ను  ఆన్ లైన్​ లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

 టూరిజం స్థలం ఎకరా 90 లక్షలు మార్కెట్ వాల్యూ ఉంటే ...టీటీడీ గజం 49 వేలు... ఎకరాకు 26కోట్ల రూపాయలు విలువ చేసే 20 ఎకరాల భూమి 460 కోట్ల విలువైన భూములు దోచిపెట్టారు. బహిరంగ మార్కెట్ లోదీని విలువ 3వేల కోట్లు ఉంటుందని  భూమన తెలిపారు.   కోహినూర్ వజ్రం కంటే ఎక్కువ ధర ఉన్న ...  టీటీడీ స్థలంకు వెల కట్టలేమని..  టూరిజం నుంచి టీటీడీ తీసుకున్న స్థలం విలువ 18 కోట్లు మాత్రమే..460 కోట్ల రూపాయలు భూములు ఎలా దోచిపెట్టారని ప్రశ్నించారు.

 ఒబెరాయ్ హోటల్ లీజు డీడ్ మనీ మాఫీ చేశారు...  భగవంతుడుకి  భక్తులు ఇచ్చిన  ఇనామ్ భూమిని  ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టారు.   సీఎం చంద్రబాబు మూడు వేల కోట్లు విలువైన స్థలం ఒబెరాయ్ గ్రూప్ నకు కట్టబెట్టి.. శంకరయ్యను...  సులేమాన్ గా ... మార్చినట్లు గా ఒబెరాయ్ ముంతాజ్ హోటల్ "స్వర" గా మార్చారని  మండిపడ్డారు. 

ఏపీ ప్రభుత్వం ప్రవేట్​ వ్యక్తులకు అప్పగించిన భూముల్లో  అత్యంత విలువైన ఎర్ర చందనం చెట్లు ఉన్నాయి.   స్వయంగా తానే వెళ్లి వెళ్ళి పరిశీలించానన్నారు.ఒబెరాయ్ హోటల్ లో  100 రూమ్స్  ఉంటే 1500 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం  ప్రజలకు చెబుతుంది. అయితే 100 రూమ్స్ కు 1500 ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు.  5 స్టార్ హోటల్ కు పేరు మార్చి ... వేల కోట్లు విలువైన ఆస్తిని దోచిపెట్టడం. పరకామణి దొంగతనం కంటే అతి పెద్ద దోపిడీ అన్నారు టీటీడీ మాజీ చైర్మన్​ భూమన.

ప్రైవేట్ హోటల్ కు టీటీడీ స్థలం దారాధత్తం చేయడం దారుణం. టీటీడీకి వచ్చిన లాభం ఏమిటి.. దీనివల్ల రూపాయి ఆదాయం లేదు. .. ఎవరికి మేలు చేయడానికి 2కోట్లు బిల్డింగ్ ఫీజు కు సర్దుబాటు చేశారు..  26కోట్ల స్టాంప్ డ్యూటీ మాఫీ చేసేశారు. 

 ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఈ భూమి ఉంది. రెవెన్యూ ల్యాండ్ ఇచ్చే అవకాశం ఉన్నా... టీటీడీ స్థలం, వెంకటేశ్వర స్వామి స్థలం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు.  ఈ విషయంపై  స్వామీజీలుమౌనం వీడి   పోరాటం చేయాలని కోరారు.  

ఏపీ ప్రభుత్వం టీటీడీ భూములను ప్రైవేట్​ వ్యక్తులకు అప్పగించడం వెనుక ప్రత్యేక అగ్రిమెంట్..  పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉందన్న భూమన ..  కూటమి ప్రభుత్వం  చేస్తున్న ఘోర తప్పిదాల విషయంలో డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్  స్పందించాలని డిమాండ్​ చేశారు