Dadasaheb Phalke Awards 2025: 'కల్కి'కి 'ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్'.. ఉత్తమ నటుడు కార్తిక్, నటిగా కృతికి అవార్డ్స్!

Dadasaheb Phalke Awards 2025: 'కల్కి'కి 'ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్'..  ఉత్తమ నటుడు కార్తిక్, నటిగా కృతికి అవార్డ్స్!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు (DPIFF) 2025 వేడుకలు ముంబైలో అట్టహాసంగా జరిగాయి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 AD' ఈ ఏడాది 'ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్'గా నిలిచి అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఉత్తమ నటుడిగా కార్తిక్ ఆర్యన్‌కు 

ప్రధాన అవార్డుల విజేతలు..

హిందీ చిత్ర పరిశ్రమలో 'చందు ఛాంపియన్' సినిమాతో అద్భుతమైన విజయం అందుకున్న నటుడు కార్తిక్ ఆర్యన్‌కు ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. అదే విధంగా తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతి సనన్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు (DPIFF) 2025 వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముంబై వేదికగా  జరిగిన ఈ వేడుకలలో  2024-2025 సంవత్సరంలో సినిమా, వెబ్ సిరీస్ , టెలివిజన్ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులను సత్కరించారు.   గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 AD' ఈ ఏడాది 'ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్'గా నిలిచి అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. 

ప్రధాన అవార్డుల విజేతలు

హిందీ చిత్ర పరిశ్రమలో 'చందు ఛాంపియన్' సినిమాతో అద్భుతమైన విజయం అందుకున్న నటుడు కార్తిక్ ఆర్యన్‌కు ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. అదే విధంగా తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతి సనన్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.

►ALSO READ | Ram Charan : 'పెద్ది'లో 'అచ్చియమ్మ' గా జాన్వీ కపూర్ .. అంచనాలు పెంచుతున్న ఫస్ట్ లుక్ !

ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఇది గర్వకారణం. గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 AD' ఈ ఏడాది 'ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్'గా నిలిచి అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. హారర్-కామెడీ చిత్రాల విభాగంలో సూపర్ హిట్ అయిన 'స్త్రీ 2' ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. 'చందు ఛాంపియన్' చిత్రానికి గాను కబీర్ ఖాన్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకోగా, విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'లాపతా లేడీస్' క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది.

సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ (DSP), 'పుష్ప 2 ది రూల్' అందించిన అద్భుతమైన సంగీతానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును గెలుచుకున్నారు. భారతీయ సంగీతానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఏ.ఆర్. రెహమాన్ 'ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్' అవార్డును అందుకున్నారు.

వెబ్ సిరీస్, టీవీ విభాగాల్లో..

ఉత్తమ వెబ్ సిరీస్ అవార్డును 'హీరామండి' గెలుచుకోగా, 'పంచాయత్ సీజన్ 3' క్రిటిక్స్ ఛాయిస్ బెస్ట్ వెబ్ సిరీస్‌గా నిలిచింది. జితేంద్ర కుమార్ (పంచాయత్) ఉత్తమ నటుడిగా (వెబ్ సిరీస్), హుమా ఖురేషి (మహారాణి) ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు. టెలివిజన్ రంగంలో 'యే రిష్తా క్యా కెహ్లాతా హై' 'టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్'గా నిలిచింది.

జీవిత సాఫల్య పురస్కారాలు..

భారతీయ చలనచిత్ర రంగానికి సుదీర్ఘ సేవలందించినందుకు సీనియర్ నటి జీనత్ అమన్‌కు, సంగీత రంగానికి సేవ చేసినందుకు గాయని ఉషా ఉతుప్‌కు 'అవుట్‌స్టాండింగ్ కాంట్రిబ్యూషన్' అవార్డులు దక్కాయి. నటి శిల్పా శెట్టికి 'ఎక్సలెన్స్ ఇన్ ఇండియన్ సినిమా' అవార్డు లభించింది.